కరోనా కారణంగా అనేక కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశాన్ని కల్పిస్తున్నాయి. దీంతో గంటల తరబడి కదలకుండా ఒకే చోట కూర్చుని పని చేస్తున్నారు. పైగా పని అయిపోయేంతవరకు నోట్లో ఏదో ఒకటి వేసుకుని నములుతూనే ఉంటారు. ఇది ఎంత అపాయకరమో ఎవరైనా ఆలోచించారా? ఎప్పుడూ తినేంతగానే తింటున్నాం.. అంతకుమించి ఒక్క ముద్ద ఎక్కువగా తినట్లేదు అంటూ మీరు సమాధానమిచ్చినా ప్రమాదం పొంచే ఉంది. ఆ ప్రమాదాన్ని నిలువరించాలంటే మీరు కంప్యూటర్ మీద ఎంతసేపు పని చేసినా శారీరక వ్యాయామం తప్పనిసరి.