తీవ్రవాద సంస్థలతో సంబంధం ఉందన్న సమాచారం నేపథ్యంలో ఇస్లామిక్ సంస్థ పీఎఫ్ఐ (పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా)కి చెందిన వంద మందిని ఎన్ఐఏ (జాతీయ దర్యాప్తు సంస్థ) అరెస్టు చేసింది. బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయం వరకు జరిపిన దాడుల్లో మొత్తం వంద మందికిపైగా నిందితులను అరెస్టు చేశారు.