రాష్ట్రంలోని సామాన్య ప్రజలందరికీ వినోదం అందుబాటులో ఉండేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) చెప్పారు. సినిమా టికెట్ల రేట్లను పరిశీలించేందుకు హైకోర్టు సూచనల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కమిటీని నియమించిందని వెల్లడించారు. ఈ కమిటీ త్వరలో సమావేశమై అందరి విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుని టికెట్ రేట్లను నిర్ణయిస్తుందన్నారు. మంగళవారం ఏపీ సచివాలయంలో సినిమా పంపిణీదారుల ప్రతినిధులతో మంత్రి సమావేశమయ్యారు.