ఆంధ్రప్రదేశ్‌లో చిత్ర పరిశ్రమ అభివృద్ధికి అన్ని విధాలా సహకరిస్తామని సినిమాటోగ్రఫీశాఖ మంత్రి పేర్ని నాని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో సినీ ప్రముఖులు భేటీ ముగిసింది. అనంతరం పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ.. చిన్న సినిమాకు ఒక స్థానం ఉండేలా చూడాలని సినీ ప్రముఖులు కోరినట్లు తెలిపారు. సినీ పరిశ్రమకు అండగా ఉంటానని సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హామీచ్చారని పేర్కొన్నారు. ప్రభుత్వం నుంచి ఏం కావాలన్నా సహకారం అందిస్తామని సీఎం జగన్ చెప్పారని తెలిపారు.