ఈ కాలం అమ్మాయిలను వేధిస్తోన్న ముఖ్యమైన సమస్య “బెల్లీ ఫ్యాట్”. దీన్ని తగ్గించుకోవడానికన్నా కవర్ చేసుకోడానికే ఎక్కువ తంటాలు పడుతూ ఉంటారు. ఎక్కువగా తినడం లేదా ఎక్కువ కేలరీలు ఉన్న ఆహారాన్ని తీసుకోవడం ద్వారా పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోతుంది. అయితే పైసా ఖర్చు లేకుండా పొట్ట దగ్గర పేరుకుపోయిన కొవ్వును సులువుగా కరిగించేయొచ్చు. ఇంట్లోనే ఎంతో సులువైన “పవనముక్తాసనం” వేశారంటే సరిపోతుంది. పవనం అంటే గాలి, ముక్త అంటే తొలగించడం. పేగుల్లో పేరుకుపోయిన అపాన వాయువును తొలగిస్తుంది. కాబట్టే దీనికి ఆ పేరు వచ్చింది. ఈ ఆసనాన్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయవచ్చు.