ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయానికి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరు పెట్టడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. దీనిపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. ఇంట్లో వారి పేర్లను ప్రజా ఆస్తులకు పెట్టడం ఏంటీ? అని పవన్ కల్యాణ్ అన్నారు. వివాదాలు సృష్టించాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందని చెప్పారు. ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయ పేరును మార్చి ఏమి సాధించాలనుకుంటున్నారో రాష్ట్ర పాలకులు సహేతుకమైన వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.