ఐర్లాండ్‌తో తొలి టి20లో కష్టపడి విజయం సాధించిన సౌతాఫ్రికా రెండో టి20 మ్యాచ్‌లో విజృంభించింది. ప్రొటిస్ బౌలర్ వేన్ పార్నెల్ ఐదు వికెట్లతో చెలరేగడంతో లక్ష్య ఛేదనలో ఐర్లాండ్ అల్లాడిపోయింది. ఈ విజయంతో రెండు మ్యాచ్‌ల టి20 సిరీస్‌ను దక్షిణాఫ్రికా 2-0తో క్లీన్‌స్వీప్ చేసింది. కాగా పార్నెల్‌కు టి20ల్లో ఇదే తొలి ఐదు వికెట్ల ప్రదర్శన. మ్యాచ్ విషయానికి వస్తే తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. రీజా హెండ్రిక్స్ 42 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. క్లాసెన్ 39, మిల్లర్ 34 నాటౌట్ రాణించారు. ఐర్లాండ్ బౌలరల్లో డెలాని 2 వికెట్లు తీశాడు.