పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్ (PIA) విమానంలో ఓ పాకిస్థానీ ప్రయాణికుడు వీరంగం సృష్టించాడు. సీట్లను తన్నడంతో పాటు, విమానం కిటికీ అద్దాలను పగలగొట్టే ప్రయత్నం చేశాడు. సదరు వ్యక్తి వికృత చేష్టలతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విమాన సిబ్బంది వ్యక్తివద్దకు చేరుకొని అతన్ని అదుపుచేసేందుకు తీవ్రంగా శ్రమించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.