తమిళ హీరో విశాల్ నటించిన సినిమాలన్నీ తెలుగులోనూ విడుదలవుతుంటాయి. ఈ పరంపరలోనే ఆయన నటించిన సామాన్యుడు మూవీ జనవరి 26న థియేటర్లలో రిలీజవుతోంది. ఇందులో డింపుల్ హయాతీ హీరోయిన్‌గా నటించింది.
లేడీ ఓరియంటెడ్ సినిమాలపై దృష్టి సారించింది కీర్తి సురేశ్. ఆమె ప్రధాన పాత్రలో నటించిన సినిమా గుడ్‌లక్ సఖి. నగేష్ కుకునూర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా కరోనా వల్ల ఎన్నోసార్లు వాయిదా పడుతూ వచ్చింది. ఆది పినిశెట్టి, జగపతిబాబు ముఖ్యపాత్రల్లో నటించిన ఈ చిత్రం జనవరి 28న రిలీజ్ కానుంది.