కరోనా వల్ల థియేటర్లు మూతపడటంతో వినోదానికి కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయాయి ఓటీటీలు. ప్రస్తుతం థియేటర్లు తెరచి ఉన్న భారీ చిత్రాల సందడి మాత్రం లేదు. అడపదడపాగా రిలీజ్ అయిన కొన్ని బడా చిత్రాలను అతి తక్కువ సమయంలోనే ఓటీటీల్లో రిలీజ్ చేసి క్యాష్ చేసుకున్నారు నిర్మాతలు. ఇక చిన్న సినిమాలు, వైవిధ్యమైన చిత్రాలకు ఓటీటీలు బెస్ట్ ప్లాట్‌ఫామ్‌గా నిలిచాయి. ఇలా థియేటర్ల కంటే ఓటీటీల్లో విడుదలవుతున్న సినిమాలు, వెబ్ సిరీస్‌ల సంఖ్య ఎక్కువగా ఉంటోంది.