తెలంగాణలో ఒమిక్రాన్ వేరియంట్ కరోనా వైరస్ వచ్చే వారం నాటికి తీవ్రస్థాయికి చేరుకుంటుందని కాంటినెంటల్ ఆసుపత్రుల చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్, ప్రపంచ ప్రసిద్ధిగాంచిన గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డాక్టర్ గురు ఎన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. వచ్చే వారం తర్వాత తగ్గుతుందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. దేశంలో రెండు మూడు వారాల్లో పీక్‌కు చేరుకుంటుందని చెప్పారు. ఫిబ్రవరి చివరి నాటికి తగ్గుముఖం పడుతుందన్నారు. మానవుడి పుట్టుక తర్వాత ఇంత వేగంగా విస్తరించిన వైరస్ లేదని, ఇదే మొదటిసారి అని తెలిపారు. ప్రస్తుతం కరోనా వైరస్ తీవ్రత, వ్యాప్తి, చికిత్స, వ్యాక్సినేషన్ తదితర అంశాలపై డాక్టర్ గురు ఎన్ రెడ్డి ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే..