భారత్‌లో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ టెన్షన్ నెలకొంది. రోజురోజుకు ఒమిక్రాన్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. దేశంలో ఇప్పటి వరకు 1270 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఒమిక్రాన్ వ్యాపిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో ఆంక్షలు అమలు చేస్తున్నారు. తాజాగా దేశంలో తొలి ఒమిక్రాన్ మరణం నమోదైంది. మహారాష్ట్రకు చెందిన ఒమిక్రాన్ బాధితుడు గుండెపోటుతో మృతిచెందాడు. పూణేలోని పింప్రీ చించువాడ మున్సిపల్ కార్పొరేషన్‌కు చెందిన 52 ఏళ్ల వ్యక్తి ఒమిక్రాన్‌తో చనిపోయినట్టు మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ధారించింది.