తెలంగాణ ప్రభుత్వం ఇవాళ జాతీయ సమైక్యతా దినోత్సవం నిర్వహిస్తుండగా, బీజేపీ తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహిస్తోంది. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో బీజేపీ నిర్వహిస్తోన్న తెలంగాణ విమోచన దినోత్సవానికి ముఖ్య అతిథిగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హాజరయ్యారు. అమర వీరులకు నివాళులర్పించారు. అమిత్ షాతో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే, కర్ణాటక మంత్రి బి.శ్రీరాములు, తదితరులు హాజరయ్యారు.