నెదర్లాండ్స్ మరోసారి అద్భుత పోరాటం కనబరిచింది. నామమాత్రపు ఆఖరి వన్డేలో పర్యాటక పాకిస్తాన్ జట్టుకు చుక్కలు చూపించింది. ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగిన పోరులో పరాజయం పాలైనప్పటికీ అభిమానుల మనసులు గెలుచుకుంది. కాగా రీషెడ్యూల్డ్ వన్డే సిరీస్ నేపథ్యంలో పాకిస్తాన్.. నెదర్లాండ్స్ పర్యటనకు వెళ్లింది.