బుల్లితెరపై ప్రసారమయ్యే ఎన్నో సీరియళ్లలో నటించింది నవీన. తన నటనతో ఆడియన్స్‌ను ఆకట్టుకున్న నవీన ధారావాహికల ద్వారా బాగానే సంపాదించింది. పైసా పైసా పెట్టి కూడబెట్టిన డబ్బుతో కొత్తింటి కల సాకారం చేసుకుంది. తాజాగా తన కలల ఇంట్లోకి అడుగు పెట్టిన ఆమె గృహప్రవేశం పేరిట ఓ వీడియోను సొంత యూట్యూబ్ ఛానల్‌లో రిలీజ్ చేసింది. అంతేకాదు, ఈ గృహప్రవేశం కోసం మొట్టమొదటి సారిగా లక్ష రూపాయలు పెట్టి కొన్న చీరను కట్టుకుని తెగ మురిసిపోయింది.