టాలీవుడ్‌లో ఫీమేల్ యాంకర్స్ చాలా మంది ఉన్నారు కానీ మేల్ యాంకర్స్ చాలా తక్కువ మందే ఉన్నారు. వారిలో యాంకర్ రవి, ప్రదీప్ లాంటివారు మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కానీ వాళ్లు ప్రీరిలీజ్ ఈవెంట్స్ అంతగా చేయరు . అందులోనూ పాన్ ఇండియా స్థాయి సినిమాలకు యాంకరింగ్ చేసిన అనుభవం లేదు. అయితే తాజాగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ‘రాధేశ్యామ్’ప్రీరిలీజ్ ఈవెంట్‌కి ఓ కొత్త యాంకర్ వచ్చాడు. అతనెవరో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మన జాతిరత్నం.. నవీన్ పొలిశెట్టి.