1972లో వచ్చిన ‘పండంటి కాపురం’ సినిమాతో నటుడిగా ఇండస్ట్రీలో తెరంగేట్రం చేశాడు నరేశ్ విజయకృష్ణ. అప్పట్లో హీరోగా, ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా వరుస సినిమాలతో సత్తా చాటుతున్నాడీయన. తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో సుపరిచితులైన ఈయన ఈ మధ్యే సకల సదుపాయాలు ఉండేలా ఓ కారవ్యాన్ కొనుగోలు చేసి వార్తల్లో నిలిచాడు. తాజాగా నరేశ్ ఓ ఖరీదైన స్పోర్ట్స్ కారును సొంతం చేసుకున్నాడు.