వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న యంగ్ హీరో శ్రీవిష్ణు, ప్రస్తుతం ‘అల్లూరి’ అనే పవర్‌ఫుల్ సినిమాతో మనముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ‘నిజాయితీకి మారుపేరు’ అనే ట్యాగ్‌లైన్ ఈ సినిమాకు ఫిక్స్ చేసింది చిత్ర యూనిట్. కెరీర్‌లో తొలిసారి పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో శ్రీవిష్ణు నటిస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ అయ్యింది. ఇక ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్స్, టీజర్లు ఇప్పటికే ప్రేక్షకుల్లో ఈ సినిమాపై పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేశాయి.