‘‘ఇటీవల హస్తినాపురంలోని ఓ ఆలయంలో చోరీ జరిగింది. ఈ కేసులో నిందితులు వాడిన కారు దొంగిలించిందే. సేమ్ మోడల్, రంగు ఉన్న కారు నంబర్‌ను ఆన్‌లైన్‌లో వెతికి, నకిలీ హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్‌ను తయారు చేశారు. ఆపై దీన్ని కొట్టేసిన కారుకు తగిలించి..ఆలయంలో చోరీకి పాల్పడ్డారు. సీసీటీవీలోని ఫుటేజ్ ఆధారంగా కారు నంబర్ సేకరించిన పోలీసులు.. ఆ అడ్రస్‌కు వెళితే అక్కడున్నది నిందితులు కాకపోవటంతో పోలీసులు ఖంగుతిన్నారు.’’