హిందీ బుల్లితెర ప్రేక్షకులను అలరించే మోస్ట్ పాపులర్ సీరియల్లో ‘నాగిని’ ఒకటి. 2015లో ప్రారంభమైన ఈ సీరియల్ ఇప్పటివరకు ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. తెలుగులో కూడా ‘నాగిని’ మొదటి రెండు సీజన్లను ప్రసారం చేశారు. ఆ సీజన్స్‌కు తెలుగు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణే లభించింది. ఇప్పుడు తాజాగా ఈ సీరియల్ ఆరో సీజన్ రాబోతున్న విషయం తెలిసిందే. ఇందులో హిందీ బిగ్‌బాస్ సీజన్ 15 విన్నర్ తేజస్వీ ప్రకాష్ ప్రధాన పాత్రలో అలరించనుంది.