మరోసారి భారతదేశంలో మతసామరస్యం వెల్లివిరిసింది. జ్ఞానవాపి మసీదు కేసు విషయం ఎంత సంచలనమైందో తెలిసిందే. ఈ క్రమంలో జ్ఞానవాపి మసీదు బయట గోడలపై ఉన్న హిందూ దేవతల విగ్రహాలకు పూజలు చేసుకునేందుకు జిల్లా కోర్టు అనుమతించిన విషయం కూడా తెలిసిందే. ఈ క్రమంలో వారణాసి మతసామరస్యానికి వేదికగా నిలిచింది. వివాదాస్పద జ్ఞానవాపి మసీదులో హిందువులకు స్థానిక ముస్లిం మహిళలు మద్దతు పలికారు. బ్యాండు మోగిస్తూ సంబరాలు చేసుకున్నారు. అంతేకాదు..వారణాసిలోని లాంహిలోని సుభాష్ భవన్‌లో భోలేనాథ్ స్వామికి హారతి ఇచ్చి మతసామరస్యాన్ని చాటుకున్నారు.