హైదరాబాద్ మహానగరంలోని కొండాపూర్ లో అత్యంత దారుణ ఘటన చోటుచేసుకుంది. నిండు గర్భిణిని దారుణంగా హత్య చేసిన ఘటన నగరంలో జరిగింది. నిండు గర్భిణి అని కూడా చూడకుండా వేటకొడవలితో నరికి చంపిన ఘటన గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. తన భార్యతో తనపై కేసు పెట్టించారనే కక్షతో విచక్షణ మరిచిన మృతురాలి ఆడపడుచు భర్త ఇంటికొచ్చి వేటకొడవలితో నరికి దారుణంగా హత్య చేశాడు. తన భార్యతో తనపై పోలీసు కేసు పెట్టించారని కక్ష పెంచుకున్న శ్రీరామకృష్ణ అనే వ్యక్తి బావమరిది ఇంట్లో లేకపోయేసరికి ఇంట్లోనే ఉన్న బావమరిది భార్యను నిండు గర్భిణి అని కూడా చూడకుండా పాశవికంగా హత్య చేశాడు.