పొట్టి ఫార్మాట్ క్రికెట్‌లో వినోదాన్ని పంచేందుకు మరో సరికొత్త టీ20 లీగ్ త్వరలోనే ఆరంభం కానుంది. దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు వచ్చే ఏడాది సౌతాఫ్రికా టీ20 లీగ్ టోర్నీతో ముందుకు రానున్న విషయం తెలిసిందే. అయితే, పేరుకు ఇది ప్రొటిస్ లీగ్ అయినా ఇందులో పాల్గొనబోయే ఆరు జట్లను బీసీసీఐ నిర్వహించే ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగమైన ఫ్రాంఛైజీలే కొనుగోలు చేయడం విశేషం.