టాలీవుడ్‌లో ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద క్లాసిక్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా భారీ విజయాన్ని అందుకున్న మూవీ ‘సీతా రామం’. దర్శకుడు హను రాఘవపూడి ఈ సినిమాను తెరకెక్కించిన తీరు అద్భుతంగా ఉండటంతో ప్రేక్షకులు ఈ సినిమాకు పట్టం కట్టారు. ఇక ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్, మృణాల ఠాకూర్‌లు తమ కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్‌లతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు.