పేసర్ మొహమ్మద్ షమీ (5/44) పదునైన బౌలింగ్‌కు తోడు ఇతర పేసర్లు కూడా సత్తా చాటడంతో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో భారత్‌కు భారీ ఆధిక్యం లభించింది. బ్యాటింగ్ వైఫల్యంతో సఫారీ టీమ్ తొలి ఇన్నింగ్స్‌లో 197 పరుగులకే కుప్పకూలింది. ఫలితంగా భారత్‌కు 130 పరుగుల ఆధిక్యం లభించింది. తెంబా బవుమా (52; 10 ఫోర్లు) మినహా ఎవరూ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు.