ప్రధాని నరేంద్ర మోదీ తన స్వరాష్ట్రం గుజరాత్‌లో పర్యటించే వేళ.. మత ఘర్షణల అలజడి చెలరేగింది. కచ్ జిల్లా భుజ్ ప్రాంతంలో ఓ వ్యక్తి హత్యతో శుక్రవారం రాత్రి రెండు వర్గాల మధ్య ఘర్షణ.. అల్లర్లకు, ఉద్రిక్తతలకు దారి తీసింది. ఈ ప్రాంతంలోనే షెడ్యూల్ ప్రకారం.. ప్రధాని మోదీ శనివారం ముందుగా పర్యటించాల్సి ఉంది.