భారత ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్, రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇవాళ షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీవో) సభ్య దేశాల శిఖరాగ్ర సదస్సులో పాల్గొననున్నారు. ఈ సదస్సు ఉజ్బెకిస్థాన్‌లోని సమర్‌కండ్‌లో నేటి నుంచి జరగనుంది. ఇందులో ప్రాంతీయ సమస్యలతో పాటు అంతర్జాతీయ అంశాలు చర్చిస్తారు. షాంఘై సహకార సంస్థ 2001లో ప్రారంభమైంది. ఇందులో ఎనిమిది పూర్తిస్థాయి సభ్య దేశాలు ఉన్నాయి.