రాష్ట్రంలో ఆదర్శ పాఠశాలల్లో 282 టీజీటీ, పీజీటీ పోస్టులకు ఈ నెల 7 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని పాఠశాల విద్యా శాఖ కమిషనర్ కె.సురేష్‌కుమార్ తెలిపారు. కాంట్రాక్ట్ విధానంలో ఈ పోస్టులను భర్తీ చేస్తామన్నారు. ఈ మేరకు మంగళవారం పోస్టుల భర్తీ షెడ్యూల్ విడుదల చేశారు. మొత్తం 282 పోస్టుల్లో 71 టీజీటీ కాగా 211 పీజీటీ పోస్టులు ఉన్నాయి. అభ్యర్థులు http://cse.ap.gov.in ద్వారా దరఖాస్తులను సమర్పించాలన్నారు. ఇతర పద్ధతుల్లో వచ్చే దరఖాస్తులను అనుమతించబోమని స్పష్టం చేశారు. తప్పుడు సమాచారం ఇచ్చినా, నకిలీ సర్టిఫికెట్లు సమర్పించినా వారి దరఖాస్తులు తిరస్కరిస్తామన్నారు.