మనలో మొలకెత్తిన ఒక ఆలోచన కొత్త మార్గాన్ని తెలుసుకునేదై ఉండాలి. ఆ ఆలోచనను ఆచరణలో పెడితే అది ఉత్తమమైన మార్గం వైపు సాగేలా ఉండాలి. ప్రియంకానంద ఆలోచన, ఆచరణ ఉన్నతి వైపుగా అడుగులు వేయించింది. గ్లామర్ ప్రపంచాన్ని వదిలి, తన గ్రామంలోని ఇరుకు రోడ్ల గతుకుల బతుకులను మార్చడానికి ప్రయాణమైంది.
ఒరిస్సాలోని బలంగిర్ జిల్లాలోని ధులుసర్ గ్రామానికి చెందిన ప్రియంకానంద తన ఊళ్లో స్కూల్ చదువు పూర్తవగానే భోపాల్‌కి వెళ్లిపోయింది. అక్కడే పై చదువులు చదువుకుంది. కాలేజీ చదువులు పూర్తి చేసుకునే క్రమంలోనే గ్లామర్ ప్రపంచంవైపుగా అడుగులు వేసింది.