జీహెచ్‌ఎంసీ శేరిలింగంపల్లి జోనల్ కార్యాలయంలో మొబైల్ కోవిడ్ వ్యాక్సిన్ వ్యాన్‌ను జాయింట్ జోనల్ కమిషనర్ మల్లారెడ్డి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ 60 ఏళ్ళు నిండిన వారు రెండు డోసుల వ్యాక్సి న్ వేయించుకొని 9 నెలలు పూర్తి అయితే బూస్టర్ డోస్ వేస్తామన్నారు. వికలాంగులు, సిక్ అయిన వారికి ఇంటికే వెళ్లి బూస్టర్ డోస్ వేస్తామని వివరించారు.