చైనా భూభాగంలో గల్లంతైన భారతీయ బాలుడు మిరమ్ తరోన్.. తీవ్ర ఉద్రిక్తతల నడుమ తిరిగి స్వదేశానికి చేరుకున్న సంగతి తెలిసిందే. అయితే అప్పటిదాకా బంధీగా ఉంచుకుని.. అప్పగించే ముందు తమ కొడుకును చైనా సైన్యం చిత్ర హింసలు పెట్టిందని బాలుడి తల్లిదండ్రులు కన్నీటి పర్యంతం అయ్యారు.
360p geselecteerd als afspeelkwaliteit
చైనా సైనికులు మిరమ్ తరోన్‌ను చాలాసార్లు తన్నారని, రెండుసార్లు కరెంట్ షాకిచ్చారని తండ్రి ఓపాంగ్ తరోన్ ఆరోపించారు. కుమారుడి రాక సంతోషాన్నిచ్చిందని, కానీ మిరామ్‌ను చైనా బాధించిందని ఆ పేద రైతు వాపోయారు. చైనా భూభాగంలోకి వచ్చినట్లు గమనించి తప్పించుకోవడానికి మిరమ్ యత్నించాడని, కానీ చైనా సైనికులు పట్టుకొని హింసించారని ఓపాంగ్ చెప్పారు. అనంతరం మిరమ్‌ను బంధించి టిబెట్ భాషలో ప్రశ్నించారని, వారి భాష అర్థం కాక తన కుమారుడు సరైన సమాధానమివ్వకపోవడంతో కరెంటు షాకులిచ్చారని తెలిపారు.