ఉద్యోగుల మేలుకే ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని పలువురు మంత్రులు తెలిపారు. అందువల్ల ఉద్యోగులు ఆందోళనలు, సమ్మెలు విరమించాలని విజ్ఞప్తి చేశారు. కరోనా సమయంలో ఆందోళనలు చేయడం సరికాదన్నారు. సామరస్యంగా చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని కోరారు. మంత్రుల కమిటీ ఉద్యోగులతో చర్చించడానికి సదా సిద్ధంగా ఉందని గుర్తు చేశారు. ప్రభుత్వంలో ఉద్యోగులు ముఖ్య భాగమన్నారు. తమది ఫ్రెండ్లీ ప్రభుత్వమని తెలిపారు. ఉద్యోగుల ఆందోళనలపై గురువారం పలువురు మంత్రులు రాష్ట్రవ్యాప్తంగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఎవరు ఏమన్నారంటే..