టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఎన్టీఆర్ కుటుంబంపై ఏపీ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా నిప్పులు చెరిగారు. అధికారంపై ఆశలు పెట్టుకున్న టీడీపీ అధినేత చంద్రబాబుకు వచ్చే ఎన్నికల్లోనూ భంగం తప్పదన్నారు మంత్రి రోజా. ఈసారి కుప్పంలోనూ చంద్రబాబుకి ఓటమి తప్పదని ఆమె జోస్యం చెప్పారు. మరోవైపు హెల్త్ యూనివర్సిటీకి వైఎస్ఆర్ పేరు పెట్టడాన్ని ఎన్టీఆర్ కుటుంబం రాజకీయం చేస్తోందని ఫైర్ అయ్యారు రోజా.