టీడీపీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు కుమారుడు చింతకాయల విజయ్ కి ఏపీ సీఐడీ నోటీసుల ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై మంత్రి జోగి రమేష్ స్పందించారు. విజయ్ ఏ తప్పు చేయకపోతే ఎందుకు గోడ దూకి పారిపోయాడని మంత్రి జోగి రమేశ్ ప్రశ్నించారు. అతడేమీ తప్పు చేయకపోతే సీఐడీ పోలీసులకు ధైర్యంగా సమాధానం చెప్పాలని అన్నారు.