ఎవరికైనా ఆపద వస్తే నేనున్నా అని ముందుకొచ్చే వ్యక్తి మంత్రి కేటీఆర్. నేరుగా కానీ, ట్విట్టర్ లో కానీ ఇతరుల ద్వారా కానీ ఎవరికైనా సాయం కావాలని తెలిస్తే కేటీఆర్ స్పందించి ఆదుకుంటారు. అలా ఇప్పటివరకు ఆయన చాలామందికి సాయం చేశారు. అలా సాయం పొందిన వారిలో చాలామంది ఇప్పుడు ఉన్నత స్థితిలో ఉన్నారు.
అలా కేటీఆర్ సాయం పొంది చదువుకున్న రుద్ర రచన అనే విద్యార్థిని ఏకంగా 4 ప్రముఖ ఐటీ కంపెనీల్లో ఉద్యోగం సంపాదించింది. జగిత్యాల జిల్లాకు చెందిన అనాథ యువతి రుద్ర రచన చుదువుకు కేటీఆర్ సహకరించారు. ఆయన ప్రోత్సాహంతో రుద్ర ఇంజినీరింగ్ పూర్తి చేయడమే కాదు క్యాంపస్ సెలక్షన్ లో 4 ప్రముఖ ఐటీ కంపెనీల్లో కొలువు సంపాదించింది. ఈ సందర్భంగా తన ఆనందాన్ని మంత్రి కేటీఆర్ తో పంచుకోవాలనుకుంది. మంత్రి కేటీఆర్ ను కలిసింది. తన చదువుకి సహకరించిన కేటీఆర్ కు ధన్యవాదాలు తెలిపింది. తన సాయంతో బాగా చదువుకుని కొలువు సాధించిన రుద్రను చూసి కేటీఆర్ భావోద్వేగానికి గురయ్యారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని కేటీఆర్ రుద్రను ఆశీర్వదించారు.