ఉపాధి హామీ పథకంలో పనిచేసే కూలీలకు ఇప్పుడు అందుతున్న కూలి కంటే ఎక్కువ మొత్తం దక్కేందుకు వీలుగా పనిగంటలు పెంచుకోవాలని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ అన్ని జిల్లాల డ్వామా పీడీలకు, ఉపాధి హామీ పథకం సమన్వయకర్తలకు ఆదేశాలు జారీచేసింది. ప్రస్తుతం గ్రామాల్లో ఈ పథకం కింద పనిచేసే వారికి సరాసరిన రూ. 221ల చొప్పున కూలి అందుతోంది. అయితే, మన రాష్ట్రంలో గరిష్టంగా రూ.245 చొప్పున కూలి ఇచ్చే అవకాశముంది. ఇందుకనుగుణంగా రోజు వారీ కూలీ రూ.245 వచ్చేలా కూలీల పనిగంటలు పెంచుకోవాలని గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కోన శశిధర్ ఆదేశాలు జారీచేశారు.