అనారోగ్యాలతో బాధపడే పురుషులకు వైద్య పరీక్షల కోసం త్వరలోనే మల్లేశ్వరంలో, రామనగర జిల్లాసుపత్రిలో ఆరోగ్య కేంద్రాలను ప్రయోగాత్మకంగా ఆరంభించనున్నట్లు మంత్రి సీ.ఎన్.అశ్వత్థ్‌నారాయణ తెలిపారు. మంత్రి మాట్లాడుతూ పురుషులు పలు అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు, అయితే వీరిలో ఎక్కువమంది ఆసుపత్రికి రావటం లేదు. ఈ సమస్యను అధిగమించేలా వారి కోసమే ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు.