హార్ట్ డిజైన్…
గుండె ఆకృతిలో వేసే మెహెందీ డిజైన్ ఆధునిక శైలికి అద్దం పడుతుంది. చిన్న మూలాంశంతో హృదయాకారంలో వేసే మెహందీ డిజైన్ స్వచ్ఛతను, నమ్మకాన్ని సూచిస్తుంది. ఇది బంధానికి బలమైన పునాది అని నమ్ముతారు. ఈ కారణంగా, పెళ్లికూతురుకు వేసే మెహెందీ డిజైన్‌లో హార్ట్ షేప్ తప్పక మెరిసిపోతుంది.
వధూవరుల డిజైన్…
చాలా వరకు పెళ్లిలో వధూవరులను మెహెందీ డిజైన్లలో చిత్రిస్తారు. వధూవరుల షెహనాయ్ కూడా ఉంటుంది. భార్యాభర్త ఎప్పటికీ విడిపోక అన్యోన్యంగా కలిసి ఉంటారనే సంకేతాన్ని ఇస్తుంది ఈ డిజైన్.