మావోయిస్టు పార్టీ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి హిడ్మా పోలీసులకు లొంగిపోయినట్టు జరుగుతున్న ప్రచారాన్ని ఆ పార్టీ ఖండించింది. కేంద్ర ప్రభుత్వంతోపాటు తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వాలు ఓ వ్యూహం ప్రకారం అసత్య ప్రచారం చేస్తున్నాయని మావోయిస్టు పార్టీ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ అధికార ప్రతినిధి వికల్ప్ గురువారం ఓ ప్రకటనలో విమర్శించారు.