తెలంగాణ సరిహద్దుల్లో.. మళ్లీ మావోయిస్టుల అలజడి మొదలైంది. కొన్ని నెలలుగా నిశ్శబ్దంగా ఉన్న ఏజెన్సీలో.. మావోయిస్ట్ దళాల సంచారం కలకలం రేపుతోంది. ప్రజా కోర్టులో శిక్ష తప్పదంటూ.. టార్గెట్లకు మావోలు వార్నింగ్‌లు ఇస్తుండటంతో.. పోలీసులు అప్రమత్తమయ్యారు. సరిహద్దుల్లో మావోయిస్ట్ వ్యవస్థ నిర్మూలనకు.. తెలంగాణ, చత్తీస్‌గఢ్ పోలీసులు జాయింట్ టాస్క్ ఫోర్స్ క్యాంప్‌ని కూడా ఏర్పాటు చేశారు.