ఇద్దరు కలిసిమెలిసి బతికారు. అన్నింటా ఒక్కటై మెలిగారు. అలాంటి ప్రాణ స్నేహితుల జీవితంలో కరోనా మహమ్మారి ప్రవేశించింది. ఒకరిని బలిగొంది. నువ్వు లేని ఈ జీవితంలో నేను ఉండలేనంటూ మరో మిత్రుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. మెండోరా మండలం పోచంపాడ్‌లో నివాసం ఉండే తిమ్మాన్‌పల్లి శ్రీనివాస్ (31), కంచు రవి (31) స్నేహితులు. కాలనీలో డెయిరీ ఫాం పెట్టుకుని పాల వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. శ్రీనివాస్ 15 రోజుల క్రితం కరోనాతో మృతి చెందాడు. దీంతో రవి మానసికంగా కుంగిపోయాడు.