బాలీవుడ్ హాట్ బ్యూటీ మలైకా అరోరా మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవలె కరిష్మా కపూర్ ఇంట్లో పార్టికి హాజరైన మలైకా.. కారు దిగబోతు బ్యాలెన్స్ అదుపు తప్పి కిందపడబోయింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతుంది. గ్రీన్ కలర్ బోల్డ్ అవుట్‌ఫిట్‌లో సూపర్ స్టైలిష్‌గా కనిపించిన ఆమె హైహీల్స్ వేసుకుంది. అయితే కారు నుంచి కిందికి దిగేటప్పుడు మాత్రం బ్యాలెన్స్ చేయలేక కిందపడిపడబోయింది.