టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి బుధవారం తెల్లవారుజామున తీవ్ర అనారోగ్య సమస్యల కారణంగా కన్నుమూశారు. ఆమె హఠాన్మరణంతో ఘట్టమనేని కుటుంబ సభ్యులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. అయితే ఆమె మృతిపట్ల మహేష్ బాబు అండ్ ఫ్యామిలీకీ ప్రముఖులతో పాటు అభిమానులు కూడా తమ ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నారు.