మంత్రి కేటీఆర్ ఉత్తర కుమార ప్రగల్భాలు ఆపి.. బోధన్ నిజాం షుగర్ ఫ్యాక్టరీని వెంటనే తెరిపించాలని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్ డిమాండ్ చేశారు. సీసీఐ(సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) సంగతి సరే.. అది కేంద్ర ప్రభుత్వం చేతుల్లో పని.. రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లోని బోధన్ నిజాం షుగర్ ఫ్యాక్టరీ గురించి ఎందుకు ప్రస్తావించడం లేదని ప్రశ్నించారు.