హైదరాబాద్ మాదాపూర్ లో ఐటీ కంపెనీ బోర్డు తిప్పేసింది. దాదాపు 200మందికి ఉద్యోగాలు కల్పిస్తామని ఐటీ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ డబ్బులు వసూలు చేసింది. ఒక్కొక్కరి నుంచి లక్ష నుంచి రెండు లక్షల రూపాయలు వసూలు చేసింది ఈ ఫేక్ ఐటీ కంపెనీ. ఐటీ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ డైరెక్టర్ ప్రతాప్ ను మాదాపూర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంతకుముందు న్యాయం చేయాల్సిందిగా బాధితులతో కలిసి మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ శివసేనా రెడ్డి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు.