బరువు తగ్గడానికి చాలా మంది రకరకాల ప్రయత్నాలు చేస్తారు. ఎక్కువ మంది ఒకపూట ఆహారం మానేసి చపాతీలు తింటుంటారు. అయితే చపాతీలు గోదుమపిండితో తయారు చేస్తారు. గోధుమ పిండిలో గ్లూటెన్ అనే పదార్థం ఉంటుంది. గ్లూటెన్ సీలియాక్ అనే వ్యాధి వస్తుంది. గోధుమ పిండిని ఎక్కువగా తీసుకుంటే కడుపు నొప్పి వస్తుంది. గోధుమ పిండి రొట్టె కంటే రాగి, లేదా జొన్న పిండితో తయారు చేసిన రొట్టెలను తీసుకోవటం ద్వారా బరువు త్వరగా తగ్గవచ్చు.