ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ అధికారులు దూకుడు పెంచారు. అరుణ్ రామచంద్ర పిళ్ళై, గోరుంట్ల బుచ్చి బాబు (CA), అభినవ్ రెడ్డి, అభిషేక్ రావు, గండ్ర సృజన్ లను విచారించిన ఈడీ.. వీరు ఇచ్చిన సమాచారం మేరకు సోమవారం అరుచోట్ల సోదాలు నిర్వహించింది. సుచిత్రా, కొండాపూర్ లోని రెండు నివాసాలలో, మాదాపూర్ వార్సన్ సాఫ్ట్ వేర్ సంస్థ, ఉప్పల్ లోని సాలిగ్రామ్ టెక్నాలజీలో ఈడీ సోదాలు నిర్వహించింది. బిల్డర్ శ్రీనివాస్ ఇంట్లో సోదాలు చేసి అతన్ని అదుపులోకి తీసుకొని సుమారు ఆరు గంటల పాటు ఈడీ అధికారులు విచారించి అతని స్టేట్ మెంట్ నమోదు చేసుకున్నారు. శ్రీనివాస్ రావు ఇచ్చిన సమాచారం మేరకు మరికొంత మందినిసైతం విచారించేందుకు ఈడీ అధికారులు సిద్ధమవుతున్నారు.