మహిళలు ఉద్యోగాల్లో చాలా రకాల సమస్యలను ఎదుర్కొంటారు. అది ఆఫీసు బాస్ కారణంగానే లేక తోటి ఉద్యోగుల కారణంగానో సమస్యలు ఎదుర్కొవల్సి వస్తుంటుంది. అయితే కొంతమంది మరీ పైశాచికంగా ఒక మహిళా మంచిగా పనిచేస్తున్నప్పటికీ ఏవో సాకులు చూపుతూ ఆమెను ఇబ్బందులకు గురిచేయడమే లేక తొలగించాలని చూస్తారు. అచ్చం అలాంటి సమస్య ఎదుర్కొంది.. ఇక్కడోక లెక్చరర్. పైగా కోర్టు మెట్లెక్కి మరీ ఆ సంస్థకు సరైన బుద్ధి చెప్పింది ఎలాగో తెలుసా!.
అసలు విషయంలోకెళ్తే.. యూకేలోని ఎక్సెటర్ విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న ఫిజిక్స్ లెక్చరర్ డాక్టర్ అన్నెట్ ప్లాట్‌ని అన్యాయంగా తొలగించారు. పైగా ఆమె స్వరం చాలా పెద్దదని, చాలా బిగ్గరగా మాట్లాడుతోందంటూ ఆరోపణలు చేసి మరీ ఆమెను విధుల నుంచి తొలగించారు. దీంతో ఆమె ఎంప్లాయిమెంట్ ట్రిబ్యునల్ కోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు ఆమె కోర్టులో.. “యూనివర్సిటీ తన పట్ల పక్షవాత ధోరణి చూపిస్తోంది. సహజంగానే నాది పెద్ద స్వరం. పైగా నా స్వరం పెద్దగా ఉండటానికి యూరోపియన్ యూదు నేపథ్యం కూడా ఒక కారణం.