గాయిని లతా మంగేష్కర్‌కు మృతిపట్ల నివాళిగా ఉభయ సభలను గంటపాటు వాయిదా వేశారు. లోక్‌సభ బడ్జెట్‌పై చర్చలో భాగంగా.. గిరిజన వ్యవహారాల కేంద్ర మంత్రి అర్జున్ ముండా త్రిపురలోని షెడ్యూల్డ్ తెగల జాబితాను సవరించే బిల్లును ప్రవేశపెట్టనున్నారు.
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఉభయ సభలు సోమవారం ప్రారంభమయ్యాయి. రాజ్యసభలో భారత రత్న, దివంగత ప్రముఖ గాయని లతా మంగేష్కర్‌కు నివాళులు అర్పించారు. రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు సభలో లతా మంగేష్కర్ సంతాప సందేశాన్ని చదివి వినిపించారు.