కరోనా వైరస్ ఇంకా అంతమవ్వనేలేదు. భారత్‌లో కోవిడ్ తీవ్రత తగ్గినప్పటికీ నిత్యం వేలల్లో కేసులు నమోదవుతూనే ఉన్నాయి. దీనికి తోడు దేశంలో మంకీపాక్స్ కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇక కరోనాకు పుట్టినిల్లుగా భావించే చైనాలో మరో కొత్త రకం వైరస్ హడలెత్తిస్తోంది. అదే లాంగ్యా హెనిపా వైరస్‌గా వైద్యులు గుర్తించారు. ఇది జంతువుల నుంచి మనుషులకు వ్యాపిస్తుంది.